హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో ఆవు మృతి!

BHNG: వలిగొండ మండలం కంచనపల్లిలో విద్యుదాఘాతంతో రైతు జగన్‌కు చెందిన అవు మృతి చెందింది. గ్రామ శివారులో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న విద్యుత్, పశువైద్య శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి ఆవు ఖననం చేశారు. దీని విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని రైతు తెలిపారు.