హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ నేషనల్స్‌కు 'లక్ష్య' ముగ్గురు అథ్లెట్ల ఎంపిక

HNK: పంజాబ్‌లోని లుథియానా గురునానక్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే యూత్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు హనుమకొండ ‘లక్ష్య’ కేంద్రానికి చెందిన అమూల్య, స్ఫూర్తి, బన్నీ సోమవారం ఎంపికయ్యారు. 3000 మీటర్ల రేస్‌వాక్, 110 మీటర్ల హర్డిల్స్‌లో వీరు పోటీపడనున్నారు. కోచ్ తిరుపతి తెలంగాణ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. వారిని పలువురు అభినందించారు.