హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి: ఎస్పీ

NLG: ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 34 మంది భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఎస్పీకి అందజేశారు.