హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసులో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష!

NZB: నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల శిక్ష విధిస్తూ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి హరీషా సోమవారం తీర్పు చెప్పారు. నిందితులు బింగేవార్ రాజమణి, బింగేవార్ రాజు, మాధవ్లపై హత్యానేరం రుజువయ్యింది. దీంతో నిందితులకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10వేల జరిమాన విధించారు.