హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయం నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

JGL: మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం పనులకు సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. గీత కార్మికుల విన్నపం మేరకు దేవాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అర్చకులు రాము శర్మ ఆధ్వర్యంలో దేవాలయం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారు.