WNP: తెలంగాణ పీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కీలకమని చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజేంద్రప్రసాద్ యాదవ్‌కు చిన్నారెడ్డి ఘన సన్మానం


