KMM: మధిర కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌పై న్యాయమూర్తి దీప్తి వేముల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించే చర్యలపై చర్చించారు. సివిల్, చెక్ బౌన్స్, కుటుంబ, క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
లోక్ అదాలత్ విజయవంతానికి సన్నాహక సమావేశం


