హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 7 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు

సంగారెడ్డి జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్ 7 వరకు పొడిగించినట్లు DIEO గోవిందరావు తెలిపారు. యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రవేశ ప్రక్రియలో జాప్యం జరగకుండా నిర్ణీత వ్యవధిలోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.