హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరేడుచర్లలో డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన

SRPT: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే మండలంలో కొనసాగుతోందని మండల వ్యవసాయ అధికారి ఎస్కే జావేద్ తెలిపారు. రెవెన్యూ గ్రామాల వారీగా వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేరేడుచర్ల గ్రామంలో జరుగుతున్న సర్వేను అధికారులు పరిశీలించి, రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.