KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాతలింగాల రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో బి.తారాదేవి తెలిపారు. పంటల నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు,వాతావరణం, వర్షపాతం, భూగర్భ జలాల స్థాయిపై నిపుణులు అవగాహన కల్పిస్తారన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ : ఏవో


