KNR: గంగాధర మండలం మల్లాపూర్ ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ నూతన ఛైర్మన్‌గా తూడి లచ్చన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేసి ఆయనకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. అనంతరం సంఘం సభ్యులు, మత్స్యకారులు లచ్చన్నకు అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
మల్లాపూర్ మత్స్య సంఘం ఛైర్మన్‌గా తూడి లచ్చన్న


