హైదరాబాద్: 28°C
తెలంగాణ

హజ్ యాత్ర పేరుతో రూ.11 లక్షల మోసం.. నిందితుడు అరెస్ట్

ADB: ఆదిలాబాద్‌లో హజ్ యాత్ర పేరుతో రూ.11 లక్షలు మోసం చేసిన కేసులో ఏజెంట్ ముదాసిర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. గోల్డెన్ ట్రావెల్స్ పేరిట బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహమ్మద్ ఇనూస్ కోసం గాలిస్తున్నట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.