హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

SRCL: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి మహాలింగార్చనను వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు చేశారు లింగాకారంలో దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.