ADB: ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ విప్లవోద్యమ నేత కుర్సంగె మోతి బాయి (రాధక్క) సోమవారం సాయంత్రం మృతి చెందారు. 1984లో పీపుల్స్ వార్‌లో చేరిన ఆమె, దళ సభ్యురాలిగా మొదలై దండకారణ్యంలో 'క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం' నాయకురాలిగా సేవలందించారు. ఆమె అంత్యక్రియలు రూరల్ మండలం లింగూగూడలో ఇవాళ జరగనున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
తెలంగాణ
అనారోగ్యంతో విప్లవోద్యమ నేత రాధక్క మృతి


