హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. గ్రామస్తుల హర్షం'

ADB: బేల మండలంలోని రాయ్‌పూర్ గ్రామానికి ఏళ్లుగా రోడ్డు లేక ఆదివాసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారుల స్పందించకపోవడంతో సోమవారం ఆయన తన సొంత నిధులతో జేసీబీ ద్వారా రోడ్డు సౌకర్యం కల్పించారు. ఇబ్బందులు తొలిగిపోవటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.