హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందాం: ఎస్పీ

KMR: గణేష్ నవరాత్రులు, శోభాయాత్రల సందర్భంగా కామారెడ్డిలో SP రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్ సన్నాహక సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. గణేష్ మండపాలకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, CC కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి 10 వరకే లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉందని, డిజేలు, బాణాసంచా నిషేధమని తెలిపారు.