హైదరాబాద్: 28°C
తెలంగాణ

'100% హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలి'

ASF: ఆసిఫాబాద్ కలెక్టరెట్‌లో సోమవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ హరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 627 పాఠశాలల్లో FLN అమలవుతోందని, 1- 5 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ హాజరు ఉన్న పాఠశాలల్లో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు 100% పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.