హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ బీచ్‌లో యువకుల గల్లంతు

AP: విశాఖ యారాడ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆవిరల్ సింగ్(23) మల్కాపురంలోని బంధువుల ఇంటికి వచ్చి, మిత్రులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. నలుగురు స్నానానికి దిగగా, అలల తాకిడికి ఆవిరల్ సింగ్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.