హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలకు జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

AP: రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షా బంధనం అన్నది ఆత్మీయత, అనురాగాల పండగ అని తెలిపారు. ఈ పౌర్ణమి అక్కాచెల్లెమ్మలకు అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.