హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం: సీఈసీ

ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలకు ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని స్పష్టం చేశారు. ఇవి ఇతర వైర్‌లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావుని.. అందుకే వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించారు. SMలో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు.