హైదరాబాద్: 28°C
వార్తలు

CPSను రద్దు చేయాలి: ఉద్యోగుల డిమాండ్

TG: CPSను రద్దు చేయాలని రాష్ట్ర కాంటిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. వెంటనే పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. పాత విధానంతో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు మనుగడ సాగించగలవని తెలిపింది. ఆ కుటుంబాల భవిష్యత్ తరాల మనుగడ కోసం పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది.