హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ, BRS పార్టీలు భయపడుతున్నాయి: చామల

TG: రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకూడదనేలా బీజేపీ, BRS వైఖరి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. RRR, మూసీ, ఫ్యూచర్ సిటీ, పెట్టుబడులు వస్తే తమ మనుగడ ఉండదని ఆ పార్టీలు భయపడుతున్నాయన్నారు. సీఎం రేవంత్ ఏం చేసినా కాళ్లల్లో కర్రలు వేయాలనే ఉద్దేశంతో ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వస్తే తప్పు ఏముందని నిలదీశారు.