హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో పొత్తు దిశగా ఎస్పీ-ఆప్

యూపీలో కొత్త పొత్తు దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయటంపై సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పరిశీలిస్తున్నాయి. ఈ మేరకు లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ పొత్తు ద్వారా బీజేపీ గద్దె దింపాలని ఇరు పార్టీ యోచిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఆప్ 15-20 సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.