హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం వివాదంపై రాందేవ్ కీలక వ్యాఖ్యలు

వందేమాతరంలోని ఆరు చరణాలను పాడటంపై నెలకొన్న వివాదంపై యోగాగురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించటం కాదని, కేవలం భారతమాతకు చేసే ఆరాధన అని తెలిపారు. భారతమాత ఆరాధనను దేవతలతో ముడిపెట్టి ఒక మతానికి వ్యతిరేకమని చెప్పడం మేధో దివాళాకోరుతనమని మండిపడ్డారు.