హైదరాబాద్: 28°C
వార్తలు

13కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్‌లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా ఇద్దరు చనిపోగా.. వీరితో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. మరో 50 మందికిపైగా ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి.. మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున్న మరణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.