హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో 1,2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.