హైదరాబాద్: 28°C
వార్తలు

10 రోజులైనా ఎందుకు ప్రోరోగ్ చేయలేదు: కాంగ్రెస్‌

లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 10 రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ సభను ప్రోరోగ్‌ చేయకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. డీలిమిటేషన్‌ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉందని ఆరోపించింది. అందుకోసం కేంద్రమంత్రి అమిత్‌షా 2/3 మెజారిటీ కోసం వెతుకులాటలో ఉన్నారంటూ మండిపడింది.