హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగు దాడిలో రైతుకు గాయాలు

AP: తిరుపతి జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో 12 ఏనుగుల గుంపు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో చంద్రగిరి మండలం మూలపల్లిలో ఓ ఏనుగు రైతుపై దాడికి తెగబడింది. తన పొలం వద్దకు వెళ్లిన కేసులరెడ్డి (60)పై ఈ ఏనుగు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రైతును వెంటనే నారావారిపల్లి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.