హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ ప్రగతిలో 90 శాతం కాంగ్రెస్‌దే: ఖర్గే

ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక భారతదేశ నిర్మాణానికి పునాది వేసింది కాంగ్రెస్ అని ఆ పార్టీ చీఫ్ ఖర్గే అన్నారు. ప్రస్తుత దేశాభివృద్ధిలో 90శాతం కాంగ్రెస్ కృషే ఉందని వెల్లడించారు. నెహ్రూ ఐఐటీలు, ఐఐఎంలు, PSUలను స్థాపించి ప్రగతిపథంలో నడిపించారని, లాల్ బహదూర్ శాస్త్రి హరిత, శ్వేత విప్లవాలకు బాటలు వేశారని తెలిపారు. అలాగే ఇందిరా బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.