హైదరాబాద్: 28°C
వార్తలు

చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

E.G: కాకినాడ సిటీ మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో పాటు నలుగురు మున్సిపల్ అధికారులపై చర్యలకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో  సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ప్రైవేటు భూమి సేకరించి, TDS బాండ్లు జారీ చేసిన ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ప్రభుత్వం ఆదేశించిన విచారణ అనంతరం విజిలెన్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.