హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖలో సముద్రం అలజడి

AP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలల ఉధృతికి తీరం కోతకు గురైంది. ఇసుక తిన్నెలు కొట్టుకుపోయి కొబ్బరి చెట్లు వేళ్లతో సహా బయటపడ్డాయి. చెట్లు కూలే అవకాశం ఉండటంతో పర్యాటకులు బీచ్‌ వైపు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. తీరక్షీణతకు శాశ్వత పరిష్కారం చూపాలని పర్యాటకులు కోరుతున్నారు.