హైదరాబాద్: 28°C
వార్తలు

చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

AP: గత ప్రభుత్వ హయాంలో కాకినాడలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలకు పాల్పడినట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విజిలెన్స్ విచారణలో తేలింది. ఆయనతో పాటు నలుగురు మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో ద్వారంపూడి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.