హైదరాబాద్: 28°C
వార్తలు

స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు తీపిక‌బురు

AP: సహాయక సంఘాల్లో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గినా రుణ సదుపాయం కల్పించేలా ఏపీ గ్రామీణ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. మరణాలు, వలసల వల్ల సభ్యులు 8 మందికి తగ్గినా, పాత బకాయులు లేకపోతే రిపీట్ డోస్ రుణం మంజూరు చేసేలా తెచ్చిన ఉత్తర్వులు మహిళలకు ఎంతో ఊరటనిస్తాయని ఆయన పేర్కొన్నారు.