హైదరాబాద్: 28°C
వార్తలు

RTC ఉద్యోగుల కుటుంబాలకు సర్కారు పెద్దపీట

AP: ఆర్టీసీలో వైద్య అనర్హతతో ఉద్యోగ విరమణ చేసిన, మృతి చెందిన 76 మంది కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించేందుకు ప్రభుత్వం జీవో 35ను జారీ చేసింది. ఐదేళ్ల సర్వీస్ నిబంధనను సడలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఇందులో 43 మంది వైద్య అనర్హత పొందిన వారు కాగా, 33 మంది అనంతం మృతి చెందిన ఉద్యోగులున్నారు.