హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్సీలకు గుడ్ న్యూస్

AP: ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను తాడేపల్లి కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. అర్హులైన ఎస్సీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు, రుణాల కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఎస్సీల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పేర్కొన్నారు.