హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్‌మంతర్‌ ఆందోళనలపై కొత్త వివాదం

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో మైనర్లు పాల్గొన్నారంటూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఫైజాన్ అన్సారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆందోళనలకు కారణమైన నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఇండోర్ అడిషనల్ డీసీపీ రాజేష్ దండోటియా తాజాగా మీడియాకు వెల్లడించారు.