హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం

TG: మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారాన్ని సొంత అవసరాల కోసం ఆయన వాడుకున్నాడు. సుమారు 700 గ్రాముల బంగారం కనిపించడం లేదని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల బంగారాన్ని వేరే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ తనఖా పెట్టినట్లు తేలగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.