పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదాలకే పరిమితమవుతున్నాయి. విపక్షాల ఆందోళనల నడుమ 18 రోజుల పాటు సభలు స్తంభించిపోయాయి. ఏకంగా 79.3 గంటల సభా సమయం వృథా కావడంతో, గంటకు రూ.1.5 కోట్ల చొప్పున సుమారు రూ.216 కోట్ల ట్యాక్స్‌పేయర్ల డబ్బు నీళ్లపాలైంది. అయితే, సభలో ప్రతిపక్షాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం 19 బిల్లులను ఆమోదించడంతో పాటు FCRA బిల్లును జేపీసీకి పంపిన విషయం తెలిసిందే.
వార్తలు
నీళ్లపాలైన రూ.216 కోట్ల ప్రజాధనం!


