హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ విశాఖకు రానున్నారు. వరల్డ్ ఎలిఫెంట్ డే ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్రమంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ హాజరుకానున్నారు. అడవుల సంరక్షణ, ఏనుగులు, మానవుల మధ్య ఘర్షణల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో పవన్ చర్చిస్తారు.