ASR: జిల్లాలో 'ఎల్‌నినో' ప్రభావం, పంటల పరిస్థితిని పరిశీలించేందుకు ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. లాంఫాం సీనియర్ శాస్త్రవేత్త ముకుందరావు నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ బృందాలు గురువారం పలు మండలాల్లో పర్యటించి పంటల తీరును అధ్యయనం చేయనున్నట్లు ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి.బి. ప్రదీప్కుమార్ తెలిపారు.
వార్తలు
ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక అధ్యయనం


