హైదరాబాద్: 28°C
వార్తలు

ముప్పాళ్ళలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

PLD: ముప్పాళ్ళలో కలెక్టర్ ఆదేశాల మేరకు ముప్పాళ్ళలో 'హర్ ఘర్ తిరంగా' సైకిల్ ర్యాలీ ఘనంగా జరిగింది. మండల పరిషత్ ఆఫీస్ నుంచి హైస్కూల్ వరకు ఎంపీడీవో శివప్రసాద్, ఎంఈఓల నేతృత్వంలో ఇది సాగింది. దేశభక్తిని చాటుతూ 'ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం' సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీడీవో పిలుపునిచ్చారు. ఇందులో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.