NDL: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులు, సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఆర్.కే ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మిర్జా షంషీర్ బేగ్ తదితరుల పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని యువతకు మంత్రి ఫరూక్ సూచించారు.
వార్తలు
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఫరూక్


