హైదరాబాద్: 28°C
వార్తలు

డీఈఈ సెట్-2026 కౌన్సెలింగ్ ప్రారంభం

SKLM: డీఈఈ సెట్-2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆధారిత ఎంపికలు సమర్పించాల్సి ఉంటుందని గార మండలం వమరవల్లి డైట్ ప్రిన్సిపల్ ఎ. గౌరీశంకరరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు అభ్యర్థులకు సీట్ల కేటాయింపు, తాత్కాలిక ప్రవేశపత్రాల జారీ ఉంటుందన్నారు. అనంతరం 21 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన అన్నారు.