హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు త్వరగా తాగునీరు అందించాలి: ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో AIIB పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి కుళాయి కనెక్షన్ అందించనున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు తాగునీరు అందించే బాధ్యత కాంట్రాక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలన్నారు.