హైదరాబాద్: 28°C
వార్తలు

పనికి వెళ్తున్నానని చెప్పి మహిళ అదృశ్యం...!

SRD: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీకి చెందిన మంజుల(34) అదృశ్యమైన ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవించే మంజుల ఈ నెల 1న భర్తతో గొడవ జరిగిన అనంతరం మరుసటి రోజు పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.