TG: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో తండ్రీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. రాజశేఖర్ తన కుమారులు ఆర్యన్, అయాన్‌లు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాజశేఖర్ తల్లి గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
బిక్కనూరులో తండ్రీ, కుమారులు మిస్సింగ్


