లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే విపక్ష సభ్యుల ఆందోళనతో తీవ్ర గందరగోళం నెలకొంది. పలు కీలక అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతే చర్చను చేపడదామని స్పీకర్ సూచించారు. అయినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.


