హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ లీక్ వెనుక భారీ కుట్ర: CBI

నీట్ పేపర్ లీక్ అప్పటికప్పుడు జరిగింది కాదని, దీని వెనుక బహుళ రాష్ట్రాలకు చెందిన వ్యవస్థీకృత ముఠా హస్తం ఉందని CBI ఆరోపించింది. పరీక్షకు నెలల క్రితమే పక్కా ప్రణాళికతో ఈ కుట్ర చేశారని వెల్లడించింది. ఈ స్కామ్‌లో NTA సబ్జెక్టు నిపుణులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, బ్రోకర్లు ఉన్నట్లు CBI తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో 13 మంది నిందితుల పేర్లను చేర్చింది.