హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ఆషాడమాసం వేడుకలు

PLD: నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పద్మావతి అమ్మవారికి (అలివేలు మంగమ్మ) సంప్రదాయబద్ధంగా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మహిళలు ప్రార్థించారు.