హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నంద్యాలలో భారీ కొండచిలువ కలకలం

నంద్యాల క్రాంతినగర్‌లో అర్ధరాత్రి పది అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ ఘటనాస్థలికి చేరుకుని గంటలపాటు శ్రమించి కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో క్రాంతినగర్ కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.